తెలంగాణ

telangana

ETV Bharat / international

'చైనా టీకాతో డేంజర్​- ట్రయల్స్​కు బ్రేక్'

చైనా అభివృద్ధి చేసిన కరోనావ్యాక్​ టీకా క్లినికల్​ ట్రయల్స్​ను బ్రెజిల్ ప్రభుత్వం నిలిపేసింది. టీకా సామర్థ్యంపై అధ్యక్షుడు బోల్సోనారో అనుమానాలు వ్యక్తం చేయగా.. వ్యాక్సిన్​ ప్రయోగాలు ప్రమాదకరమని ప్రకటిస్తూ ఆరోగ్య శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

China COVID-19
చైనా టీకా

By

Published : Nov 10, 2020, 10:12 AM IST

చైనాకు చెందిన కరోనా టీకా 'కరోనావ్యాక్' క్లినికల్​ ట్రయల్స్​ను బ్రెజిల్​ ఆరోగ్య శాఖ నిలిపివేసింది. ఈ టీకా ప్రయోగాలు ప్రమాదకరమని ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ వ్యాక్సిన్​ను చైనా ఫార్మా సంస్థ సినోవాక్ అభివృద్ధి చేసింది. దీనిని బ్రెజిల్​లో బూటానన్​ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. అయితే, బ్రెజిల్ ఆరోగ్య శాఖ ప్రకటనపై బూటానన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విషయంపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహిస్తామని తెలిపింది.

బ్రెజిల్​ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో వ్యాఖ్యలతో కరోనావ్యాక్ టీకాపై వివాదం చెలరేగింది. టీకా సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేసిన బోల్సొనారో.. బ్రెజిల్ ప్రజలు జంతువులు కారని మండిపడ్డారు.

ఇదీ చూడండి:2021కల్లా చైనా 'కరోనా వ్యాక్సిన్'​!

ABOUT THE AUTHOR

...view details