ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల ద్వారా ప్రయోజనం పొందాలని చైనా భావిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. భారత్‌తో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే అందుకు నిదర్శనమన్నారు. చైనా వ్యవహరిస్తున్న తీరుపై ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషాయాలు వెల్లడించారు పాంపియో.
చైనా బెదిరింపులకు పాల్పడుతున్న విషయం వాస్తవమేనన్నారు పాంపియో. వారు చాలా కాలంగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని, సమస్యలున్న ప్రతిచోటా బెదిరింపులు కూడా ఉంటాయన్నారు. 10 సంవత్సరాల క్రితం నాటి చైనా కమ్యూనిస్టు పార్టీకి, ప్రస్తుత పార్టీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు పాంపియో. అధ్యక్షుడు జిన్‌పింగ్ చైనా సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.