తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2019, 4:05 PM IST

Updated : Nov 2, 2019, 8:24 PM IST

ETV Bharat / international

ఆమోదం దిశగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం!

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద సూత్రాలపై ఏకాభిప్రాయం వచ్చిందని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఒప్పందంపై అయోవాలో సంతకం చేసే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటించడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

ఆమోదం దిశగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం!

ఆమోదం దిశగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం!

అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఫలప్రదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు రెండు దేశాల ప్రభుత్వ పెద్దల ప్రకటనలు బలం చేకూరుస్తున్నాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పంద సూత్రాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.

"చైనా ఉప ప్రధాని​ లియూ శుక్రవారం అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్​ లితీజర్​, ఆర్థిక మంత్రి మ్యూచిన్​తో ఫోన్​లో మాట్లాడారు. వాణిజ్య ఒప్పందం విషయంలో ఎదురవుతున్న ప్రధాన సమస్యలను, వాటి పరిష్కారాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపారు. వాణిజ్య ఒప్పంద సూత్రాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. తదుపరి సంప్రదింపులపైనా ఇరుపక్షాలు చర్చించాయి. "- చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ

వేదిక ఖరారు!

వాణిజ్య ఒప్పందం కుదరడం ఖాయమని సంకేతాలిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒడంబడికపై సంతకాలు చేసేందుకు అయోవాను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్లు శ్వేతసౌధంలో తెలిపారు.

వాణిజ్య యుద్ధం

దిగుమతుల సుంకాల విషయంలో అమెరికా-చైనా మధ్య గత ఏడాది కాలంగా వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ ప్రభావం వందల బిలియన్​ డాలర్ల విలువైన వాణిజ్యంపై పడింది.

ఇదీ చూడండి: థాయిలాండ్ పర్యటన: బ్యాంకాక్​ చేరుకున్న మోదీ

Last Updated : Nov 2, 2019, 8:24 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details