తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా నౌకా దళాన్ని అనుమతించబోం: చైనా

అమెరికా నౌకదళం హాంకాంగ్​ను సందర్శించకుండా అడ్డుకుంటామని చైనా ప్రకటించింది. హాంకాంగ్​లో మానవ హక్కులకు మద్దతు ఇచ్చే చట్టానికి అగ్రరాజ్యం ఆమోదముద్ర వేసినందుకు సమాధానంగా ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

hongkong
అమెరికా నౌకాదళాన్ని అనుమతించబోం: చైనా

By

Published : Dec 3, 2019, 6:51 AM IST

అగ్రరాజ్య నౌకదళాన్ని హాంకాంగ్​కు రాకుండా అడ్డుకుంటామని డ్రాగన్​ దేశం చైనా ప్రకటించింది. ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులకు మద్దతుగా అమెరికా ఇటీవల రెండు చట్టాలను ఆమోదించింది. దీనికి సమాధానంగానే నౌకలను అడ్డుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది డ్రాగన్. అమెరికా ఆమోదించిన చట్టం ఎలాంటి పరిణామాలు సృష్టిస్తుందో ఇప్పటివరకు తెలియదని, అయితే వాటి మూల్యం అగ్రరాజ్యమే ఎదుర్కోవాలని హెచ్చరించింది.

ఈ చట్టాన్నిను వెనక్కి తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుందని వ్యాఖ్యానించింది. ​

"అమెరికా వైఖరికి జవాబుగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. హాంకాంగ్​ మానవ హక్కులు, ప్రజాస్వామ్య చట్టం మా అంతర్గత విషయం."

-హువా చునింగ్, మంత్రిత్వ శాఖ ప్రతినిధి

హాంకాంగ్​లో మానవహక్కులు, ప్రజాస్వామ్య చట్టం-2019కి గత వారం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆమోదముద్ర వేశారు.

ఇదీ చూడండి : మోదీ బంపర్​ ఆఫర్​.. శరద్​ పవార్​ నో..!

ABOUT THE AUTHOR

...view details