కరోనా వైరస్ సోకి, ఆస్పత్రి పాలవడం వల్ల తనకు అనుకోని మేలు జరిగిందని చెప్పారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 2 రోజుల తర్వాత వీడియో సందేశం విడుదల చేశారు. తాను కోలుకునేందుకు ఉపయోగపడిన రీజనరాన్ సహా ఇతర ఔషధాలను అమెరికన్లందరికీ ఉచితంగా అందిస్తామని స్పష్టంచేశారు.
"అమెరికా అధ్యక్షుడికి అందిన చికిత్సే ప్రతి ఒక్కరికీ లభించాలి. ఎందుకంటే ఇది నాకు గొప్ప అనుభూతినిచ్చింది. భగవంతుడి ఆశీర్వచనాల వల్లే నాకు కరోనా సోకింది. ఇది నాకు ఊహించని మేలు."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు