అమెరికాతో వాణిజ్య యుద్ధంపై చైనా వెనక్కి తగ్గుతుంది. ఇందులో భాగంగా సోయాబిన్, పంది మాంసంపై ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించనున్నట్లు.. చైనా వార్తా సంస్థ తెలిపింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించే యోచనలో చైనా ఉన్నట్లు తెలిపింది.
'పీపుల్స్ రిపబ్లిక్ చైనా' 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సుంకాల బాదుడును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 1 నుంచి 15కు వాయిదావేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత చైనా కొన్ని అమెరికా వస్తువులను అధిక పన్నుల జాబితా నుంచి తొలగించడం, మరికొన్ని వస్తువులపై సుంకాలు తగ్గించే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.