ప్రపంచంపై కరోనా వైరస్ పంజా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 94లక్షలకు చేరువయ్యాయి. ప్రస్తుతం 93,82,647 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 4లక్షల 80వేల 406మంది వైరస్ ధాటికి బలయ్యారు.
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 2,424,493 | 1,23,476 |
బ్రెజిల్ | 11,51,479 | 52,771 |
రష్యా | 6,06,881 | 8,513 |
బ్రిటన్ | 3,06,210 | 42,927 |
స్పెయిన్ | 2,93,832 | 28,325 |
పెరూ | 2,60,810 | 8,404 |
చిలీ | 2,59,767 | 4,505 |
ఇటలీ | 2,,38,833 | 34,675 |
ఇరాన్ | 2,12,501 | 9,996 |
చైనా మరోసారి...
రాజధాని బీజింగ్‌లో విజృంభించిన రెండో దఫా వైరస్‌ను చైనా విజయవంతంగా కట్టడి చేసినట్టు కనిపిస్తోంది. చైనావ్యాప్తంగా మంగళవారం 22 కేసులు నమోదుకాగా.. బుధవారం ఆ సంఖ్య 12కు పడిపోయింది. బీజింగ్‌లో కేవలం 7 కేసులే నమోదయ్యాయి.
నగరంలో 11 రోజుల్లోనే దాదాపు 2.5 మిలియన్ మందికి పరీక్షలు నిర్వహించి.. ప్రపంచ దేశాలకు తన సామర్థ్యాన్ని మరోమారు చాటిచెప్పింది చైనా.
మెక్సికో విలవిల...
వైరస్‌తో మెక్సికో విలవిలలాడుతోంది. పరీక్షలు తక్కువగా జరుగుతున్నప్పటికీ.. రోజూ వేలల్లో కేసులు బయటపడుతున్నాయి. తాజాగా 6వేల 200కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,410కు పెరిగింది. మరో 793మంది మరణించగా.. ఇప్పటివరకు వైరస్ సోకి 23,377మంది మృతిచెందారు.