తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా వ్యాక్సిన్​ డేటాను చైనా దొంగిలిస్తుంది'

చైనాపై మరోసారి అమెరికా విమర్శలు చేసింది. కరోనా వైరస్​ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని చైనా దొంగిలించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో.

China stealing US research on COVID-19: Pompeo
'కరోనా వ్యాక్సిన్​ డేటా చౌర్యానికి చైనా పాల్పడుతుంది'

By

Published : May 15, 2020, 2:23 PM IST

కరోనా విపత్తుకు చైనా బాధ్యత వహించాలంటూ డిమాండ్​ చేస్తోన్న అమెరికా తాజాగా మరోసారి ధ్వజమెత్తింది. కరోనా వ్యాక్సిన్​ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని తమ నుంచి దొంగిలించడానికి చైనా ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో.

"చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న సైబర్​ నేరగాళ్లు..​ అమెరికాకు చెందిన మేధో సంపత్తి, కొవిడ్​-19 వ్యాక్సిన్​ పరిశోధన సమాచార చౌర్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చైనా ఉద్దేశ్యపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పడుతుంది. సురక్షిత, సమర్థవంతమైన చికిత్స పరిశోధనను దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోంది." -మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

వైరస్​ పోదు..

అమెరికా ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. తమపై అసత్య ప్రచారం చేసినంత మాత్రాన వైరస్​ పోదని బదులిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది మహమ్మారి కరోనా. ఇందులో అత్యధికంగా అమెరికాలోనే మృతి చెందారు.

ఇదీ చూడండి:చైనాతో తెగతెంపులకు సిద్ధమే: ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details