చైనా గత నెల 29 న ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5-బీ రాకెట్ భూమిపై కూలేదిశగా ప్రయాణిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. 8 టన్నుల బరువున్న ఈ భారీ రాకెట్ విడిభాగం మధ్యఆసియా దేశమైన తుర్కమెనిస్థాన్‌లో కూలనున్నట్లు అంచనా నేసింది.
జనసమర్థం ఉన్న చోటే
జనసమర్థం ఉన్న ప్రాంతంలోనే ఢీకొననున్నట్లు హెచ్చరించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నాలుగున్నరకు ఇది భూమిని ఢీకొంటుందని తెలిపింది అమెరికా రక్షణ శాఖ . రాకెట్ విడిభాగం ఎక్కడ పడినా పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గంటకు 18వేల మైళ్ల వేగంతో భూమి మీదకు ప్రయాణిస్తుందని వివరించారు. రాకెట్ వేగాన్ని అది అనుసరిస్తున్న మార్గాన్ని అమెరికా స్పేస్ కమాండ్ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు.
డ్రాగన్ వాదన మరోలా