ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కరోనా. ఇప్పటివరకు 27, 365మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 5,97, 267మంది ఈ వైరస్ బారినపడ్డారు. 1,33,363 మందికి వ్యాధి నయమైంది. 1, 04, 205 కేసులతో వైరస్ సోకిన వారి సంఖ్యలో అమెరికా మొదటిస్థానంలో ఉంది. 9,134 మరణాలతో ఇటలీ మరణాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
చైనాలో పెరుగుతున్న కేసులు..
చైనాలో కరోనా వైరస్ కారణంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విదేశాల నుంచి చైనాకు వెళ్లిన 54 మందికి కొత్తగా కొవిడ్- 19 సోకిందని నిర్ధరణ అయింది. మరో 29 మందికి వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు.