అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచుతున్నట్టు చైనా ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాటు విశ్వసనీయత లేని సంస్థలపై వేటు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. చైనా టెలికం దిగ్గజం హువావేపై అమెరికా అంతర్జాతీయంగా విధించిన ఆంక్షలకు ప్రతీకారంగానే డ్రాగన్ దేశం ఈ చర్యలకు సిద్ధపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
చర్చల విఫలంతో మళ్లీ మొదటికి..
ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. చైనా వైఖరి వల్లే ఎలాంటి ఒప్పందం లేకుండా చర్చలు ముగిశాయని అమెరికా ఆరోపించింది. అనంతరం పోటాపోటీగా సుంకాల పెంపు, కంపెనీలపై వేటు వేస్తూ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నారని విశ్లేషకులు తెలిపారు.