చైనాను.. 21వ శతాబ్దానికే అతిపెద్ద, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రమాదకారిగా.. అమెరికా అభివర్ణించింది. డ్రాగన్ ఇంటా- బయట అనుసరిస్తున్న అక్రమ విధానాలతో ఇండో-పెసిఫిక్ ప్రాంతంలోని వాణిజ్యం, సంస్థలు, ప్రజలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారని పెంటగాన్ ఆరోపించింది.
చైనా తన సైన్యాన్ని ద్విగుణీకరించుకోవడం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సమతుల్యతను దెబ్బతీస్తోందని అమెరికా ఆక్షేపించింది. తద్వారా అమెరికాతో పాటు దాని భాగస్వామ్య దేశాల్లో డ్రాగన్ల పట్ల వ్యతిరేక భావనలకు కారణమవుతోందని పెంటగాన్ అధికారి చెప్పారు. ఈ విధంగా సైనిక అసమతుల్యత తెస్తున్న చైనా.. ఇండో పసిఫిక్ ప్రాంతంలో దాని ఆగడాలు నిలువరించేందుకు అమెరికా రంగంలోకి దిగేలోపే.. చైనా ఏకపక్షంగా యథాతథస్థితిని మార్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అయితే.. సైనికబలంతో చైనా చేయాలనుకుంటున్న పనులు సాధ్యపడడం అంత సులువేమీ కాదని, అమెరికా దాని మిత్రదేశాలతో కలిసి అడ్డుకుంటుందని పేర్కొన్నారు.
'భారత్‌కు 'రక్షణ'లో సహకరిస్తాం'