తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికానే తలదన్నేలా.. చైనా 'అణు' ప్రణాళికలు

విస్తరణవాద కాంక్షతో సరిహద్దు దేశాలతో తగాదాలకు దిగే చైనా.. తన భవిష్యత్తు ప్రణాళికలను భారీగా రచించుకుంటుంది. ఇప్పటికే ఉన్న తన సైనిక, ఆణు, ఆయుధ సామర్థ్యాన్ని ఈ దశాబ్దంలో రెండింతలకు పెంచుకోవడమే లక్ష్యాంగా అడుగులు వేస్తుంది. ఫలితంగా ప్రస్తుతం అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికానే వెనక్కునెట్టి, తన బలాన్ని పెంచుకునేందుకు నిశబ్దంగా తన పని కానిచ్చేస్తోంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ ఆ దేశ కాంగ్రెస్‌కు నివేదించింది.

China planning big increase in nuclear arsenal: Pentagon
అమెరికా తలదన్నాలని చైనా 'అణు' ప్రణాళికలు

By

Published : Sep 2, 2020, 1:09 PM IST

Updated : Sep 2, 2020, 1:17 PM IST

ప్రపంచంలో అమెరికాను తలదన్ని అగ్ర రాజ్యంగా అవతరించేందుకు చైనా తహతహలాడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చిన చైనా గుట్టుచప్పుడు కాకుండా తెర వెనక భారీ వ్యూహాన్ని పన్నుతోంది. ఆధిపత్యం చెలాయించేందుకు సైనిక బలమే ప్రధానమనుకుంటున్న డ్రాగన్‌ తన అణ్వస్ర సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో తలమునకలై ఉంది. ఇందులో భాగంగా సైనికంగా, ఆర్థికంగా అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాను చేరుకునేలా శక్తివంతమైన అణ్వాయుధాలకు రూపకల్పన చేస్తోంది.

ఇదీ చదవండి-అమెరికాకు చైనా వార్నింగ్-రెండు క్షిపణుల ప్రయోగం!

నివేదికలో వెల్లడి..

ఈ దశాబ్దం చివరికి అది తన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు తీవ్రంగా పనిచేస్తుందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌... ఆ దేశ కాంగ్రెస్‌కు నివేదించిన తన తాజా నివేదికలో పేర్కొంది. చైనా అణుసామర్థ్య ఆధునికీకరణ, విస్తరణ.. ప్రపంచ వేదికపై దానిని బలమైన దేశంగా మార్చడమే కాకుండా.. 2049 నాటికి ఆసియా- పసిఫిక్‌ ప్రాంతంలో అజేయమైన శక్తిగా నిలపనున్నట్లు పెంటగాన్ తెలిపింది. ఈ ప్రయత్నాలతో శ్వేతసౌధ సైనిక బలాన్ని అధిగమించేందుకు భూ, వాయు, సముద్ర తలాల నుంచి అణు ప్రయోగ వేదికలను చైనా రూపొందిస్తోందని, ఉన్న వాటిని ఆధునీకరిస్తోందని వెల్లడించింది.

400 అణు వార్​హెడ్లు లక్ష్యం!

ప్రస్తుతం బీజింగ్‌ దగ్గర 200 వరకు అణు వార్‌హెడ్లు ఉన్నాయి. వాటిలో అమెరికా భూభాగాన్ని చేరుకోగల ఖండాతర వార్‌హెడ్లు 100కి పైనే ఉన్నాయి. వచ్చే ఆయిదేళ్లలో వాటి సంఖ్యను 200కు పెంచుకోవడంతో పాటు 2030 నాటికి మొత్తంగా 400 పైచిలుకు వార్‌హెడ్లను తయారు చేసే అవకాశాలనున్నాయని పెంటగాన్‌ అంచనావేసింది. ఈ ప్రయత్నాలని ఇప్పటికే గుర్తించిన ట్రంప్‌ సర్కార్‌.. వ్యూహాత్మక అణ్వాయుధాల నియంత్రణకు ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా, రష్యాలతో జతకట్టాలని చైనాను ఆహ్వానిస్తోంది. కానీ అందుకు చైనా ససేమిరా అంటోంది. మరోవైపు.. తర్వాతి దశలోని ప్రతిష్ఠాత్మకమైన ప్రణాళికలకు ప్రస్తుత చైనా రక్షణ ప్రణాళికలు సూచికలంటూ ఆ దేశ రక్షణ శాఖ డిప్యూటి సెక్రటరీ చాడ్‌ స్ప్రాజియా వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి-ధరాతలంపై మరో ప్రచ్ఛన్నయుద్ధం!

తన సైనిక దళాల్లో ఒక విభాగాన్ని పూర్తిగా అత్యంత అప్రమత్త స్థాయిలో ఉంచేందుకు 'రెడ్‌ ఆర్మీ' సన్నాహాలు చేస్తోంది. అత్యంత తక్కువ సమయంలో అణు వార్‌హెడ్లు, క్షణాల వ్యవధిలోనే క్షిపణులు ప్రయోగించేందుకు వీలుగా ఈ ప్రత్యేక దళ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించిందని పెంటగాన్‌ వెల్లడించింది.

అమెరికా అప్రమత్తం..

చైనా ధోరణితో ముందస్తు ఆలోచనలో పడ్డ అమెరికా... చైనా విస్తరణవాదాన్ని నిలువరించి, దక్షిణ చైనా సముద్ర జలాలతో పాటు తమ మిత్ర దేశాలకు రక్షణగా నిలిచేందుకు ఒబామా హాయాంలోనే భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగానే వచ్చే 30 ఏళ్లల్లో అమెరికా అణుదళాలతో పాటు, సబ్‌మెరైన్‌, దీర్ఘశ్రేణి బాంబర్లు, భూ ఆధారిత క్షిపణుల ఆధునికీకరణ, ఆయుధ నియంత్రణ వ్యవస్థల ఏర్పాటుకు ఒక ట్రిలియన్‌ డాలర్లను ఖర్చు చేసేందుకు నిర్ణయించింది. ట్రంప్‌ సైతం ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో మద్ధతు తెలుపడంతో పాటు సైనిక పద్దుకు వందల బిలియన్ల డాలర్లను కేటాయిస్తున్నారని రక్షణ శాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ తెలిపారు.

Last Updated : Sep 2, 2020, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details