తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​, చైనాను ఎలా చూస్తే మమ్మల్నీ అలా చూడాల్సిందే'

ప్రపంచ వాణిజ్య సంస్థతో మరోసారి కయ్యానికి కాలు దువ్వారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అమెరికాను అభివృద్ధి చెందిన దేశంగా.. భారత్​, చైనాను మాత్రం అభివృద్ధి చెందుతోన్న దేశాలుగా పరిగణించడమేంటని ప్రశ్నించారు.

China,  India are viewed as a developing nations
'భారత్​, చైనాకు ఇస్తే మాకు ఇవ్వాలి.. లేదా వాళ్లకి తీసేయాలి'

By

Published : Jan 23, 2020, 6:24 AM IST

Updated : Feb 18, 2020, 1:58 AM IST

'భారత్​, చైనాను ఎలా చూస్తే మమ్మల్నీ అలా చూడాల్సిందే'

భారత్​, చైనాను అభివృద్ధి చెందుతోన్న దేశాలుగా పరిగణించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రపంచ వాణిజ్య సంస్థతో కొంతకాలంగా వివాదం నడుస్తున్నట్లు ట్రంప్​ తెలిపారు.

అమెరికాను డబ్ల్యూటీఓ న్యాయంగా చూడటం లేదని ట్రంప్​ ఆరోపించారు. చైనా, భారత్​ను అభివృద్ధి చెందుతోన్న దేశాలుగా డబ్ల్యూటీఓ పరిగణిస్తోందని.. తమ దేశానికి అదే హోదా ఎందుకు ఇవ్వడం లేదని ట్రంప్​ అసహనం వ్యక్తం చేశారు.

"నా దృష్టిలో అమెరికా కూడా అభివృద్ధి చెందుతోన్న దేశమే. కానీ చైనా, భారత్​ను అభివృద్ధి చెందుతోన్న దేశాలుగా పరిగణించడం వల్ల వారు ఎన్నో అవకాశాలను, లాభాలను పొందుతున్నారు. మమ్మల్ని అలా చూడటం లేదు. వాళ్లని అభివృద్ధి చెందుతోన్న దేశాలుగా చూడకూడదు. వాళ్లని అలా చూస్తే మమ్మల్ని చూడాల్సిందే." - డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

Last Updated : Feb 18, 2020, 1:58 AM IST

ABOUT THE AUTHOR

...view details