ప్రపంచాన్ని శాసించాలని ఆశపడుతున్న చైనాను నిలువరించాలంటే అమెరికా దీటుగా స్పందించాలని ఆ దేశ నిఘా విభాగం డైరెక్టర్ రాట్క్లిఫ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా ప్రపంచ ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు పెను ముప్పుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
"అమెరికాతో పాటు ప్రపంచదేశాలకు చైనా పలు సవాళ్లు విసురుతోంది. అమెరికా ప్రజలు దీన్ని నిశితంగా పరిశీలించాలి. ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థ, సైనిక, సాంకేతిక రంగంలో మేటిగా ఎదగడమే చైనా అంతిమ లక్ష్యం. ఈ పరిస్థితుల్లో చైనాను అమెరికా నిలువరించాలి. అమెరికాకు 500 బిలియన్ డాలర్ల నష్టాన్ని చేయడమే కాకుండా చైనా మన మోధో సంపత్తిని, సాంకేతికతను అపహరిస్తోంది."