తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎలాంటి సాయానికైనా అమెరికా సిద్ధం: ట్రంప్​

చైనాలో వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ స్పందించారు. వైరస్​ను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఎలాంటి సాయం చేసేందుకైనా అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేసారు.

China doing good job on coronavirus: Trump
ఎలాంటి సాయానికైనా అమెరికా సిద్ధం: ట్రంప్​

By

Published : Feb 8, 2020, 11:03 AM IST

Updated : Feb 29, 2020, 2:57 PM IST

ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్​ను అరికట్టేందుకు చైనా తీవ్రంగా శ్రమిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కొనియాడారు. వారికి ఎలాంటి సాయం చేయడానికైనా అమెరికా సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

"చైనా చాలా కష్టపడుతోంది. శుక్రవారం రాత్రి కరోనా వైరస్​కు​ సంబంధించి జిన్​పింగ్​తో సంభాషించాను. వారు తమ వృత్తిని కర్తవ్యంతో నిర్వర్తిస్తున్నారని భావిస్తున్నాను."

డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

కరోనా వైరస్​ కారణంగా శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 722కు చేరింది. దాదాపు 34 వేలకుపైగా కేసులు నమోదైనట్లు చైనా వైద్య అధికారులు తెలిపారు.

మరోవైపు అమెరికాలో 12 కరోనా వైరస్ కేసులను గుర్తించినట్లు అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి అలెక్స్​ అజర్​ పేర్కొన్నారు. చైనాకు సాయపడేందుకు ప్రపంచ స్థాయి నిపుణులను పంపిచేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అజర్​ తెలిపారు.

అమెరికా పౌరుడి మృతి

కరోనా వైరస్ కారణంగా చైనాలోని వుహాన్​లో అమెరికాకు చెందిన పౌరుడు శనివారం మృతి చెందినట్లు అగ్రరాజ్య రాయబార కార్యాలయం తెలిపింది.

ఇదీ చూడండి:ఆడియో క్లిప్పులపై యడియూరప్పకు సుప్రీం షాక్!

Last Updated : Feb 29, 2020, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details