ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే ఉద్భవించిందని మరోసారి ఉద్ఘాటించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. అందుకు తమ వద్ద బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. వుహాన్ ల్యాబ్ ప్రమాణాలు పాటించడం లేదని, భద్రతాా పరమైన ప్రమాదాలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
కరోనా కీలక వివరాలను చైనా దాస్తోంది: అమెరికా - us china news
కరోనాకు సంబంధించిన కీలక వివరాలను దాస్తూ ప్రపంచాన్ని చైనా గందరగోళానికి గురి చేస్తోందని ఆరోపించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చి ఉంటుందని ఆయన మరోసారి ఉద్ఘాటించారు.
చైనాలో కరోనా వైరస్‌ను గుర్తించి నెలలు గడుస్తున్నప్పటికీ ఆ దేశం దానికి సంబంధించిన కీలక విషయాలను దాచిపెడుతూ ప్రపంచ దేశాలను అయోమయానికి గురిచేస్తోందని ఆరోపించారు పాంపియో. అందుకే వుహున్ ల్యాబ్‌ను పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని విమర్శించారు. ఆస్ట్రేలియా, ఐరోపా సమాఖ్య సహా ఎవరూ ఈ విషయం గురించి అడిగినా వ్యాపార పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించి భయాందోళనకు గురి చేస్తోందన్నారు.
కరోనా కారణం అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమైంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 78,000మందికి పైగా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 13,00,000 మందికి పాజిటివ్‌గా తేలింది.