చైనా తలచుకుంటే కోరనా వైరస్ను ప్రపంచం మొత్తానికి వ్యాపించకుండా నిలువరించి ఉండేదన్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ డ్రాగన్ దేశం అలా చేయలేదని, అన్ని దేశాలకు వ్యాపింపజేయాలనుకుందని ఆరోపించారు. ఫలితంగా అమెరికా సహా అనేక దేశాలు వైరస్ మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్.
"వైరస్ చైనాలోనే ఉద్భవించింది. అది ఇతర దేశాలకు వ్యాపించకుండా వారు కట్టడి చేయగలిగే వారు. సులభంగా నిలువరించేవారు. కానీ అలా చేయలేదు. ఇతర దేశాలకు వైరస్ను వ్యాపింపజేయాలనుకున్నారు. చైనా మొత్తం విస్తరించకుండా ఆపగలిగారు. కానీ ఐరోపా, అమెరికా సహా ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా అడ్డుకోలేకపోయారు. కరోనా విషయంలో చైనా ఏనాడూ పారదర్శకంగా వ్యవహరించలేదు.