ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 మంది పాత్రికేయులు జైలు జీవితం గడుపుతున్నారని పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ నివేదికలో వెల్లడించింది. స్వతంత్ర మీడియాపై ప్రభుత్వాల అణచివేత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఈ సంఖ్య పెరుగుతోందని పేర్కొంది.
పాత్రికేయులు అధిక సంఖ్యలో జైల్లో వేస్తున్న దేశాల జాబితాలో చైనా తొలి స్థానంలో ఉన్నట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్'-సీపీజే తెలిపింది. టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఎరిట్రియా, వియత్నాం, ఇరాన్ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు వెల్లడించింది.
తప్పుడు వార్తలతోనే అభియోగాలు!
దేశ వ్యతిరేక వార్తలు లేదా తప్పుడు వార్తలు ప్రచురించారన్న ఆరోపణలపైనే పాత్రికేయుల్ని ఎక్కువగా అరెస్టు చేస్తున్నట్లు వివరించింది సీపీజే.