అమెరికాపై చైనా మరోసారి ఘాటు విమర్శలు చేసింది. హాంగ్‌కాంగ్‌లో కొనసాగుతున్న నిరసనల వెనుక అగ్రరాజ్యం హస్తముందని ఆరోపించింది డ్రాగన్ దేశం. ఒకవైపు అమెరికాతో వాణిజ్య యుద్ధంపై చర్చలు జరుపుతున్న చైనా... మరోవైపు ఇలాంటి ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
హాంగ్‌కాంగ్ నిరసనలపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలను చైనా తప్పుపట్టింది. నిరసనల విషయంలో చైనా సరైన నిర్ణయం తీసుకోవాలని ఇటీవలే అగ్రరాజ్య విదేశాంగమంత్రి వ్యాఖ్యానించారు. పాంపియో ఇంకా సీఐఏ ప్రధానాధికారిలాగే ప్రవర్తిస్తున్నారని మండిపడింది చైనా. విదేశాంగ మంత్రిగా నియమితులు కాకముందు సీఐఏ డైరెక్టర్‌గా పని చేశారు పాంపియో.
'చైనా అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే..'