తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాతో నర్సు మృతి.. ఘనంగా కడసారి వీడ్కోలు - chile nurse procession

చిలీలో కరోనా బాధితులకు సేవలు అందించిన ఓ నర్స్.. అదే మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె సహోద్యోగులు తమకు వైరస్ సోకుతుందనే భయంతో దూరంగా వెళ్లిపోలేదు. అమె మృత దేహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన కార్లో ఉంచి ఘనంగా చివరి వీడ్కోలు పలికారు.

chile
కరోనాతో నర్స్ మృతి.. ఘనంగా కడసారి వీడ్కోలు

By

Published : Jul 8, 2020, 2:38 PM IST

చిలీలోని శాంటియాగోలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తూ.. అదే మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయిన తమ సహోద్యోగినికి ఘనంగా కడసారి వీడ్కోలు పలికారు ఓ ఆస్పత్రి సిబ్బంది. ప్రత్యేకంగా అలంకరించిన కారులో మృతదేహాన్ని ఉంచి ఖననం చేసేందుకు పంపించారు. తమ సహచరిణిని సాగనంపుతూ కంటనీరు తెచ్చుకున్నారు. స్నేహితురాలు ఉన్న కారు వెనక కాన్వాయ్​​లా తరలివెళ్లారు.

కరోనాతో నర్స్ మృతి.. ఘనంగా కడసారి వీడ్కోలు

ఆస్పత్రి నిర్లక్ష్యంతోనే..

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ సహచరిణిని.. పూర్తిస్థాయిలో కోలుకోకుండానే యాజమాన్యం డిశ్ఛార్జి చేసిందని ఆరోపించారు సహోద్యోగులు. వైరస్​ నయమైందన్న భావనలో ఆమె ఉండగా శరీరంలో వ్యాధి తీవ్రమై ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. తమ సహచరిణిని కోల్పోయేందుకు ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమన్నారు. వైద్య సిబ్బంది కరోనా బారినపడకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

చప్పట్లతో సాగనుంపుతూ..

ఇదీ చూడండి:డబ్ల్యూహెచ్​ఓ నుంచి వైదొలుగుతున్న అమెరికా

ABOUT THE AUTHOR

...view details