ప్రతిపక్షాల ఒత్తిడితో బొలీవియా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఎవో మోరల్స్. ఈ సందర్భంగా ఆయనకు రష్యా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీవీ ఛానల్ 'ఆర్టీ'లో న్యూస్ ప్రెజెంటర్‌గా ఉద్యోగం కల్పిస్తామని తెలిపింది.
ఈ మేరకు సామాజిక మాధ్యమం టెలిగ్రామ్ ద్వారా తన ప్రతిపాదనను వెల్లడించారు ఆర్టీ ఛానల్ సారథి మార్గరీట సిమోన్యన్.
"ఆర్టీ ఛానల్ స్పానిష్ భాషలో న్యూస్ ప్రెజెంటర్‌గా మోరల్స్కు అద్భుతమైన ఉద్యోగ ఆఫర్ ఇస్తున్నాను. ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు రాఫెల్ కొరియా ఒక సంవత్సరానికి పైగా ఆర్టీ స్పానిష్ భాషలో రాజకీయ చర్చా కార్యక్రమానికి హోస్ట్‌గా ఉన్నారు."
- మార్గరీట సిమోన్యన్, ఆర్టీ ఛానల్ అధినేత