తెలంగాణ

telangana

ETV Bharat / international

స్కూళ్లలో ఇక కండోమ్స్​ తప్పనిసరి- కొత్త రూల్స్ ఇవే... - కండోమ్స్​

ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్స్​ అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది అమెరికాలోని షికాగో పబ్లిక్​ స్కూల్స్​ ఎడ్యుకేషన్​ బోర్డు. సెక్స్​ ఎడ్యుకేషన్​లో భాగంగా ఇలా చేస్తున్నట్టు వివరించింది. కానీ దీనిపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

condoms
కండోమ్​

By

Published : Jul 12, 2021, 2:04 PM IST

అమెరికాలోని షికాగో పబ్లిక్​ స్కూల్స్ ఎడ్యుకేషన్​ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో 'కండోమ్స్​' అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టనుంది. ఇది ఆ బోర్డు పరిధిలోని 600స్కూళ్లకు​ ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తిస్తుంది. ఈ మేరకు అన్ని విద్యా సంస్థలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

సెక్స్ ఎడ్యుకేషన్‌ కోసమే..

2020 డిసెంబర్​లోనే సీపీఎస్​ బోర్డు ఈ విధానాన్ని రూపొందించింది. సెక్స్​ ఎడ్యుకేషన్​లో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నది బోర్డు అభిప్రాయం. ఇక నుంచి ఎలిమెంటరీ స్కూళ్లలో 250, హైస్కూళ్లలో 1000వరకు కండోమ్స్​ అందుబాటులో ఉంటాయి. షికాగో ఆరోగ్యశాఖ సహకారంతో కండోమ్స్‌ను సప్లై చేస్తారు. ఒకవేళ కండోమ్స్ అయిపోతే ఆరోగ్య శాఖకు ప్రధానోపాధ్యాయులు సమాచారమిచ్చి రీఫిల్​ చేసుకోవచ్చు.

"ఆరోగ్యపరంగా సరైన నిర్ణయాలు తీసుకునే హక్కు యువతకు ఉంది. నిర్ణయాలకు తగ్గట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు వారికి సరిపడా వనరులు కావాలి. వాటినే మేము అందిస్తున్నాము. కండోమ్స్​ కావాలి అనుకున్నప్పుడు అవి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అనుకుంటున్నాము. ఇవి అందుబాటులో లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. లైంగిక సంక్రమణ వ్యాధులు, అవాంఛిత గర్భాలు వస్తాయి. వాటిని రాకుండా చూసుకోవడం కోసమే ఈ చర్యలు. దీనిపై కొంత వ్యతిరేకత వచ్చే అవకాశముంది. అయినప్పటికీ సమాజం మారింది అని నేను విశ్వసిస్తున్నాను."

-- కన్నెత్​ ఫాక్స్​, సీపీఎస్​ డాక్టర్​.

పాఠాలు కూడా..

కండోమ్స్​ అందించడమే కాకుండా.. షికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ రూపొందించిన సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీలో.. విద్యార్థులకు శరీర నిర్మాణ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం వంచి అంశాలను బోధిస్తారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసే తల్లిదండ్రులు బోర్డుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది సీపీఎస్.

తల్లిదండ్రులు ఫైర్​..

ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ ఇవ్వాలన్న విధానాన్ని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే 12ఏళ్ల వయసుగల వారని.. వారు ఇంకా చిన్నపిల్లలేనని అంటున్నారు. అసలు పిల్లలకు కండోమ్స్​ ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చిందని మండిపడుతున్నారు. తమ విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

అదే సమయంలో మరికొందరు సీపీఎస్​ బోర్డు నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. నష్టాన్ని తగ్గించుకునేందుకు ఇది మంచి నిర్ణయం అంటున్నారు.

ఇదీ చూడండి:-ఒలింపిక్స్​లో ఆ రూల్.. కండోమ్ తయారీదారుల నిరాశ

ABOUT THE AUTHOR

...view details