ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ఏం చేస్తారు? పాటలు.. ధ్యానం.. ఒంటరిగా కూర్చోవడం.. నచ్చివవాళ్లతో మాట్లాడటం.. వంటివి మామూలే. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఏం చేస్తున్నారో తెలుసా? సరస్సులో దూకి ఈత కొడుతున్నారు. అదీ ఒకటీ, రెండు రోజులుగా కాదు.. ఏకంగా 365 రోజుల నుంచి ఆయన అదే పనిలో ఉన్నారు.
ఇదీ సంగతీ..
కరోనా మహమ్మారి, అమెరికాలో ఎన్నికలు, దేశవ్యాప్తంగా ఆందోళనలతో విసుగు చెందారు చికాగోవాసి కానర్. వీటి నుంచి ఎలాగైనా ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో మిచిగాన్ సరస్సులో ఈత కొట్టడం ప్రారంభించారు ఈ బస్సు డ్రైవర్.
అలా గతేడాది సరస్సులో దూకడం మొదలుపెట్టిన కానర్.. దానివల్ల లభిస్తోన్న ఉల్లాసం, ఆనందం కారణంగా ఒక్క రోజు కూడా బ్రేక్ ఇవ్వలేదు. ఈ శనివారంతో ఆయన 365 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని కానర్ వివరించారు.
ఇదీ చూడండి:పీపీఈ కిట్‌తో అంబులెన్స్ డ్రైవర్ డ్యాన్స్