అమెరికా నల్లజాతీయుడు జార్జిఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీసు అధికారి డెరిక్ చౌవిన్‌ను దోషిగా తేల్చింది అమెరికా మినియాపొలిస్ కోర్టు. మంగళవారం ఈ తీర్పును వెలువరించింది. డెరిక్కు బెయిల్ రద్దు చేస్తున్నట్లు తెలిపిన న్యాయస్థానం.. మరో రెండు నెలల్లో శిక్ష ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. 40 ఏళ్ల పాటు డెరిక్కు జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు ఫ్లాయిడ్ కుటుంబసభ్యులు. ఈ తీర్పు అనంతరం.. ఫ్లాయిడ్ మద్దతుదారులు అమెరికా వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. వీధుల్లో ప్లకార్డులు పట్టుకుని తిరుగుతూ ఆనందం వ్యక్తం చేశారు. 'ఈరోజు మేము మళ్లీ శ్వాస తీసుకోగలం' అని ఫ్లాయిడ్ తమ్ముడు ఫిలోనైస్ అన్నారు.
ఇదీ చదవండి:
జాతి వివక్షపై అట్టుడుకుతున్న అగ్రరాజ్యం
జాతి వివక్షకు వ్యతిరేకంగా మూడు ఖండాల్లో నిరసనలు
'ఇంతటితో ఆగదు'
వివిక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి సంబంధించి ఇది కీలక ముందడుగు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఫ్లాయిడ్ కేసులో చౌవిన్‌ను కోర్టు దోషిగా తేల్చిన అనంతరం.. శ్వేతసౌదం నుంచి మాట్లాడారు బైడెన్. 'ఇది సరిపోదు.. ఇంతటితో ఆగదు' అని అన్నారు.