ప్రపంచదేశాలను కరోనా కలవరపెడుతోన్న వేళ.. ఓ శతాధిక వృద్ధురాలు అలవోకగా వైరస్‌ను జయించింది. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన స్పానిష్ ఫ్లూ విజృంభణ సమయంలోనే ఆమె జన్మించడం గమనార్హం. అలా... రెండు మహమ్మారులను తట్టుకొని జీవించిన మహిళగా నిలిచింది అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఏంజెలినా ఫ్రైడ్‌మ్యాన్.
లేక్ మోహీగన్ సమీపంలోని నర్సింగ్ హోంలో ఉండే ఏంజెలినా.. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం మార్చి 21న ఆసుపత్రిలో చేరింది. అయితే.. పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం.. అక్కడే ఉండి వైద్యం తీసుకుంది.
క్యాన్సర్‌పైనా పోరాడి...
చికిత్స సమయంలో అడపాదడపా జ్వరం భయపెట్టినా చివరకు ఏప్రిల్ 20న నిర్వహించిన పరీక్షల్లో ఫలితం నెగటివ్‌గా వచ్చింది. ఈ బామ్మ ప్రాణాంతక క్యాన్సర్‌నూ అధిగమించడం విశేషం.