తెలంగాణ

telangana

ETV Bharat / international

వచ్చేవారం టీకా పంపిణీ వ్యూహాలపై సీడీసీ భేటీ - అమెరికా కరోనా వ్యాక్సిన్ పంపిణీ

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను అమెరికా వేగవంతం చేస్తోంది. ఈ మేరకు పంపిణీ వ్యూహాలపై సీడీసీ సలహాదారుల బృందం మంగళవారం భేటీ కానుంది. టీకాను ముందుగా ఎవరికి అందించాలి.. ఎంత మేర సరఫరా చేయాలన్న అంశాలపై బృందం చర్చించనుంది.

VIRUS-US-VACCINE
టీకా పంపిణీ

By

Published : Nov 28, 2020, 11:40 AM IST

అమెరికాలో కరోనా టీకా పంపిణీ వ్యూహాలపై చర్చించేందుకు వ్యాధి నియంత్రణ కేంద్రం సలహాదారుల బృందం మంగళవారం భేటీ కానుంది. టీకాకు ఆమోదం లభించిన తర్వాత జనాభా సమూహాల ప్రాధాన్యం, ఎన్ని డోసులు, ఎంత మేర సరఫరా చేయాలన్న అంశాలపై సమాలోచనలు చేయనుంది.

ఈ మేరకు ఎవరికి ముందుగా వ్యాక్సిన్ అందించాలన్న విషయాన్ని సలహాదారుల సిఫార్సు చేయనున్నారు.

తొలి ప్రాధాన్యం వీరికే..

టీకా అందుబాటులోకి రాగానే మొదట ఆరోగ్య కార్యకర్తలకు ఇవ్వాలని ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నారు. నిత్యవసర వస్తువుల పరిశ్రమలలోని కార్మికులు, అనారోగ్య పరిస్థితులతో ఉన్నవారు, 65ఏళ్లకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు టీకాలు..

ఇప్పటికే ఫైజర్-బయోఎన్​టెక్ ద్వయం.. తమ కరోనా టీకా క్యాండిడేట్​ను అత్యవసరంగా ఉపయోగించడానికి అనుమతించమని ఎఫ్​డీఏను కోరింది. మోడెర్నా సంస్థ కూడా త్వరలో దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:'టీకా రాకపోతే ఆఫీసుకు వెళ్లేదెలా?'

ABOUT THE AUTHOR

...view details