ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 6 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో 13 వేల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 1,874,319కి చేరింది.
- మొత్తం కేసులు: 86,807,094
- యాక్టివ్ కేసులు: 23,410,948
- కొత్తగా నమోదైన కేసులు: 6,71,042
- మొత్తం మరణాలు: 1,874,319
- అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 22 లక్షల 5 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 3,474 మంది బాధితులు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 15 లక్షలకు పెరగ్గా.. మరణాల సంఖ్య మూడు లక్షల అరవై ఐదు వేలకు ఎగబాకింది.
- యూకేలో లాక్డౌన్ కొనసాగుతున్నా.. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 60 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 830 మంది వైరస్ బారిన పడి మరణించారు.
- బ్రెజిల్లో 57 వేల కేసులు బయటపడ్డాయి. మరో 1,186 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 24,246 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 518 మంది మరణించారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 20,489 కేసులు నమోదుకాగా..420 మంది మృతి చెందారు.