తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ మందులతో కరోనా రోగులకు హృద్రోగ సమస్యలు

కరోనా చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్​​ వాడటం వల్ల బాధితులపై దుష్ప్రభావం చూపిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. మలేరియాకు వినియోగించే మందులతో హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది.

VIRUS-DRUG-SIDE EFFECTS
ఆ మందుతో కరోనా రోగుల్లో ఆకస్మిక గుండెపోటు!

By

Published : Apr 26, 2020, 3:35 PM IST

కరోనాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్​, యాంటిబయాటిక్​ అజిత్రోమైసిన్​ కాంబినేషన్​ పనిచేస్తుందని ఇటీవల కొన్ని పరిశోధనలు నివేదించాయి. అయితే ఈ రెండు ఔషధాలను వినియోగించడం వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తుతాయని, ముఖ్యంగా ఆకస్మిక గుండెపోటు, క్యూటీసీ-ఇంటర్వెల్ (రెండు హృదయ స్పందనల మధ్య విరామం)​ ప్రొలాంగేషన్​ వంటివి సమస్యలు ఉత్పన్నమవుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది.

అమెరికా న్యూయార్క్​లోని ఓ ఆసుపత్రిలో 84 మందిపై చేసిన ఈ పరిశోధన.. నేచర్ మెడిసిన్​ జర్నల్​లో ప్రచురితమైంది. స్పందనల మధ్య విరామం వల్ల అరిథ్మియాకు దారి తీస్తుందని వెల్లడించారు పరిశోధకులు. సక్రమంగా లేని హృదయ స్పందనలతో రోగికి గుండెపోటు వచ్చే అవకాశముందని తెలిపారు.

అధిక శాతం..

వీరిలో 11 మంది క్యూటీసీ సమస్యతో ఇబ్బంది పడినట్లు పరిశోధకులు తెలిపారు. మరో నలుగురు వివిధ అవయవాల వైఫల్యంతో చనిపోయారు. చాలా మందిలో క్యూటీసీ సమస్య తలెత్తినట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్​, అజిత్రోమైసిన్​తో చికిత్స చేసే రోగులను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి పట్ల మరింత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా చికిత్సకు ఆ మందు వాడితే ప్రాణాలు హరీ!

ABOUT THE AUTHOR

...view details