రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లాటిన్ అమెరికా దేశం వెనిజువెలా ఇప్పుడు తీవ్ర విద్యుత్ సమస్యతో సతమతమవుతోంది. రాజధాని కారకస్ సహా పలు నగరాలు విద్యుత్ అంతరాయం వల్ల అంధకారంలో చిక్కుకున్నాయి. మార్చి 7న మొదటిసారి తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడగా, తాజాగా శుక్రవారం మూడోసారి ఈ సమస్య ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టింది.
"విద్యుత్ అంతరాయానికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. రాజ్యాంగాన్ని అనుసరించి మేము శాంతియుతంగానే మా నిరసన తెలుపుతాం."
- కార్లోస్ డ్యూరన్, స్వయం ఉపాధి నిపుణుడు
శుక్రవారం రాత్రి 7 గంటల 10 నిమిషాలకు విద్యుత్ అంతరాయం మొదలైంది. కారకస్తో పాటు మరాకైబో, వాలెన్సియా, మారాకీ, శాన్ క్రిస్టోబల్ నగరాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.