అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. అక్కడ వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. భవనం వద్ద ఉన్న బ్యారికేడ్‌ను బలంగా ఢీ కొట్టింది. ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఆ తర్వాత దుండగుడు ఓ పోలీసు అధికారిని కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ అధికారి చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో జవాను చికిత్స పొందుతున్నారు.
అనంతరం కారు డ్రైవర్‌ను భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. క్యాపిటల్ భవనం వెలుపల ఉన్న చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
క్యాపిటల్ ప్రాంగణాన్ని దిగ్బంధించిన అధికారులు ఆ సమయంలో అమెరికా కాంగ్రెస్ సమావేశంలో లేదు. పోలీసులపై దాడి నేపథ్యంలో కేపిటల్ భవన సముదాయం వద్ద నేషనల్ గార్డ్స్‌ను మోహరించారు. ఈ ఘటన వెనుక ఉగ్రకోణాన్ని అధికారులు కొట్టివేశారు.
జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ భవనంపై దాడి తర్వాత ఆ తరహా ఘటన ఇదేనని అధికారులు తెలిపారు. ఆ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు చనిపోయారు. దానితో ప్రస్తుత దాడికి సంబంధం ఉందని ఇప్పడే చెప్పలేమని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:'అమెరికాకు అసలైన అర్థం.. నా బృందం'