ఉత్కంఠభరిత ఛేజ్... చివరకు అరెస్ట్ - డెట్రాయిట్
అమెరికా డెట్రాయిట్లో ఓ దొంగ ట్రక్కును దొంగలించి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు చాకచక్యంగా అతడిని పట్టుకున్నారు.
కారు దొంగను వెంబడిస్తున్న పోలీసులు
అమెరికా డెట్రాయిట్లో ఓ దొంగ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఓ ట్రక్కును దొంగలించి పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. అతివేగం వల్ల ట్రక్కుపై అదుపు కోల్పోయిన అతను బండి నుంచి దిగి, కాలికి పని చెప్పాడు. గోడలు దూకి పరుగులు పెట్టాడు. అయినా పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. తెలివిగా అతడిని వెంబడించి పట్టుకుని అరెస్టు చేశారు. ట్రక్కు, అందులోని పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగాప్రస్తుతం సదరు దొంగగారు ఊచలు లెక్కపెడుతున్నారు.