తెలంగాణ

telangana

ETV Bharat / international

బాస్కెట్​బాల్​ జట్టు విజయోత్సవ ర్యాలీలో అపశ్రుతి - గందరగోళం

ఎన్​బీఏ ఛాంపియన్​షిప్​ను రాప్టర్స్​ కైవసం చేసుకున్న ఆనందంలో కెనాడాలోని టోరెంటోలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. కొంతమంది పరుగులు పెట్టడం వల్ల గందరగోళం ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు.

బాస్కెట్​బాల్​ జట్టు విజయోత్సవ ర్యాలీ.. అపశ్రుతి

By

Published : Jun 18, 2019, 12:43 PM IST

బాస్కెట్​బాల్​ జట్టు విజయోత్సవ ర్యాలీ.. అపశ్రుతి

ఎన్​బీఏ ఛాంపియన్​షిప్​ను కైవసం చేసుకున్నబాస్కెట్​బాల్​ జట్టు రాప్టర్స్​​ కెనడాలోని టొరెంటోలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. వేలాది మంది పాల్గొన్న ఈ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. కొందరు విచక్షణారహితంగా పరుగులు పెట్టి గందరగోళం సృష్టిండడం వల్ల అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని, మరో ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

ఎన్​బీఏ ఛాంపియన్​షిప్​ సాధించిన రాప్టర్స్​ జట్టు ట్రోఫీతో సహా ఊరేగింపుగా వెళ్లింది. 1993లో టొరెంటో బ్లూజేస్​ జట్టు వరల్డ్​ సిరీస్​ గెలిచింది. మరోసారి ఇప్పుడు రాప్టర్స్​ అంత ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఆ జట్టు సభ్యులను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వీధుల్లోకి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన అభినందన సభలో జట్టు సభ్యులతోపాటు, కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో పాల్గొన్నారు.

ఇంతలో కొంతమంది అభిమానులు పరుగెత్తడం వల్ల... సభా ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. పోలీసులు కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం కార్యక్రమం సజావుగా సాగింది.

ఇదీ చూడండి: బిహార్​కు మరో ఉన్నత స్థాయి వైద్య బృందం

ABOUT THE AUTHOR

...view details