Canada prime minister tested positive: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని తెలిపారు. ఆయన ఐసోలేషన్లోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అలానే పని కూడా ఒంటరిగా ఉండి చేస్తున్నట్లు వివరించారు. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే దేశ ప్రజలందరూ కచ్చితంగా టీకా పంపిణీ కార్యక్రమంలో భాగం కావాలని కోరారు. అర్హులు ఎవరైనా.. బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు.
మంగళ వారం నుంచి మరో ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు ట్రూడో. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వైరస్ బారిన పడినట్లు చెప్పారు. తన ముగ్గురు పిల్లల్లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు తెలిపారు. గతంలో ట్రూడో భార్యకు పాజిటివ్ వచ్చింది. ఆ సమయంలో కూడా ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.