తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత విమానాలపై నిషేధం పొడిగింపు - us eases travel restrictions

భారత్​ నుంచి వచ్చే విమానాలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 21 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది. మరోవైపు భారత్​కు రాకపోకలపై అమెరికా ఆంక్షలను సడలించింది.

canada suspends indian flights, భారత విమానాలు కెనడా
భారత విమానాలపై నిషేధాన్ని పొడగించిన కెనడా

By

Published : Jul 20, 2021, 10:06 AM IST

Updated : Jul 20, 2021, 12:14 PM IST

భారత్​ నుంచి విమానాల రాకపోకలపై విధించిన ఆంక్షలకు సంబంధించి కెనడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 21 వరకు ఈ నిషేదం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

భారత్​ నుంచి నేరుగా కెనడాకు రావడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించినా.. మరో దేశం మీదుగా తమ దేశాన్ని చేరుకోవచ్చని స్పష్టం చేసింది. భారత్​లో చేయించుకున్న కొవిడ్​ టెస్ట్​ను తాము పరిగణించమని పేర్కొంది. తమ దేశానికి రావాలంటే ఇతర దేశాల్లో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది.

సడలించిన అమెరికా..

మరోవైపు భారత్​కు ప్రయాణ రాకపోకలపై విధించిన ఆంక్షలను అగ్రరాజ్యం సడలించింది. ఇదివరకు విధించిన లెవల్​ 4 ఆంక్షలను లెవల్​ 3కు సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆంక్షల ప్రకారం.. భారత్​కు రాకపోకలపై ప్రయాణికులు పునరాలోచన చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

ఇదీ చదవండి :'ఎడారి' నుంచి అంతరిక్షంలోకి శ్రీమంతుడు

Last Updated : Jul 20, 2021, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details