భారత్, పాకిస్థాన్ల నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని కెనడా మరో నెలరోజుల పాటు పొడిగించింది. జూన్ 21 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కెనడా రవాణా మంత్రి ఒమర్ అల్గబ్రా స్పష్టం చేశారు. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన కెనడా - canada corona cases
భారత్, పాకిస్థాన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని కెనడా మరో నెలరోజుల పాటు పొడిగించింది. ఈ రెండు దేశాలపై ప్రయాణాల నిషేధం విధించటం వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విమానం
భారత్, పాకిస్థాన్ల నుంచి వచ్చే విమానాలపైఏప్రిల్ 22 నుంచి నిషేధం విధించటం వల్ల తమ దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని అల్గబ్రా పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'కుక్కల్లో కొత్త రకం కరోనా వైరస్'