తెలంగాణ

telangana

ETV Bharat / international

Canada Election Results: మళ్లీ ట్రూడోకే పట్టం - కెనడా ఎలక్షన్ రిజల్స్ట్

కెనడాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మరోసారి లిబరల్ పార్టీకే పట్టం కట్టారు అక్కడి ఓటర్లు. (Canada Election 2021 Results) ఆధిక్యంలో ఉన్న స్థానాలతో కలిపి మొత్తం 156 సీట్లు కైవసం చేసుకుంది లిబరల్ పార్టీ(Liberal Party of Canada). ఫలితంగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిన్ ట్రూడో.

canada election results
కెనడా ఎన్నికల ఫలితాలు

By

Published : Sep 21, 2021, 3:30 PM IST

కెనడాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న లిబరల్ పార్టీకే (Canada Election 2021 Results) మళ్లీ ఆ దేశ ప్రజలు పట్టం కట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో జస్టిన్ ట్రూడోకు (Justin Trudeau) చెందిన లిబరల్ పార్టీ వైపే (Liberal Party of Canada) ఓటర్లు మొగ్గుచూపారు. తద్వారా ట్రూడో మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. అత్యధిక సీట్లు సాధించినప్పటికీ.. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లాగే ఈ సారీ మెజార్టీకి కొద్దిదూరంలో ఉండిపోయింది లిబరల్ పార్టీ.

తాజా ఫలితాలపై స్పందించిన ట్రూడో.. దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కెనడాను మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. (Justin Trudeau tweet)

"థ్యాంక్యూ కెనడా-- మీ ఓటు హక్కు వినియోగించుకున్నందుకు, లిబరల్ పార్టీపై విశ్వాసం ఉంచినందుకు, మెరుగైన భవిష్యత్​ను ఎన్నుకున్నందుకు. కొవిడ్​పై పోరాటాన్ని మనం ముగించబోతున్నాం. కెనడాను ముందుకు తీసుకెళ్లబోతున్నాం."

-జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని

కెనడా ప్రతినిధుల సభలో (House of Commons of Canada) మెజార్టీ కోసం 170 స్థానాలు అవసరం ఉండగా.. ట్రూడోకు చెందిన లిబరల్స్ పార్టీ 156 (ఆధిక్యంలో ఉన్నవి కలిపి) సీట్లు కైవసం చేసుకుంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది ఒక స్థానం తక్కువ.

మరోవైపు, సమీప ప్రత్యర్థి కన్సర్వేటివ్ పార్టీ 121 స్థానాల్లో ముందంజలో ఉంది. 2019లోనూ ఈ పార్టీ ఇన్నే స్థానాలు గెలుచుకుంది. ఇక వామపక్ష పార్టీ అయిన న్యూ డెమొక్రాట్స్ 27, బ్లాక్ క్యూబ్కోయిస్ 32, గ్రీన్స్ రెండు స్థానాలను దక్కించుకున్నాయి.

ముందస్తుకు వెళ్లినా...

ప్రభుత్వం మైనారిటీలో ఉన్న నేపథ్యంలో జస్టిన్ ట్రూడో.. రెండేళ్ల ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. కరోనాను మెరుగ్గా నియంత్రించినందుకు తమ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికల్లో ఆధిక్యం లభిస్తుందని ఆశించారు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఫలితాల్లో పెద్దగా మార్పు రాకపోవడం గమనార్హం. అయినప్పటికీ, లిబరల్ పార్టీ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

ఇదీ చదవండి:చిన్నారుల్ని బలిగొన్న 'డ్రోన్​ దాడి'పై అమెరికా సమీక్ష

ABOUT THE AUTHOR

...view details