కరోనా మహమ్మారి యావత్ ప్రంపంచాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాది మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో కోరనాకు సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించారు అమెరికా ఆరోగ్య నిపుణులు. ఒక్కసారి వైరస్ బారిన పడిన వారికి మళ్లీ వ్యాధి సోకే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్న వారికి కొన్ని వారాల తర్వాత మళ్లీ పాజిటివ్‌గా తేలుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. రెండోసారి వ్యాధి బారినపడ్డట్లు బాధితులు భావిస్తున్నారు. అయితే పరీక్షల పొరపాట్ల వల్ల కూడా కరోనా నుంచి కోలుకున్న వారికి పాజిటివ్ వచ్చి ఉండవచ్చని తెలిపారు బోస్టన్ కాలేజ్‌లో గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. ఫిలిప్ లాండ్రిగన్. రెండోసారి పాజిటివ్ వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందదన్నారు.