గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందనే అభిప్రాయాలు కొంతకాలంగా నెలకొని ఉన్నాయి. అయితే వీటిని బలపరిచేలా ఇటీవల ప్రకటన విడుదల చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ప్రత్యేక పరిస్థితుల్లో గాలి ద్వారా కరోనా వ్యాపించవచ్చని పేర్కొంది. రెస్టారెంట్లు, నైట్ క్లబ్లు వంటి చోట్ల వైరస్ గాలిలో వ్యాపిస్తుందని.. భౌతిక దూరం నిబంధనలు పాటించనట్లయితే ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువని అభిప్రాయపడింది.
మూసి ఉండే గదుల్లో వెంటిలేషన్ సరిగా లేకపోవడం.. వైరస్ వ్యాప్తికి దోహదపడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణం కంటే ఎక్కువ సమయం వైరస్ కణాలు గాలిలో ఉండటానికి వీలు కల్పిస్తుందని చెబుతున్నారు. మాట్లాడటం ద్వారా బయటకొచ్చే లాలాజలం అన్ని మార్గాలు మూసి ఉండే గదుల్లో 8 నుంచి 14 నిమిషాల పాటు గాలిలో ఉంటుందని అంటున్నారు నిపుణులు.
వైద్య సిబ్బందికి సోకే ప్రమాదం ఎక్కువ