కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్‌లను ఉపయోగిస్తున్నారు. వీటితో పాటు ఫేస్‌షీల్డ్‌లను కూడా వినియోగిస్తున్నారు. అయితే మాస్క్‌కు బదులు షీల్డ్ వాడకం ఎంత వరకు మేలు? వాటిని వినియోగించడం వల్ల దరిచేరదా?
ఈ నేపథ్యంలో దీనిపై వైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు. వైరస్ సోకకుండా ఈ ఫేస్‌షీల్డ్ నివారించగలుగుతాయని ఎక్కడా కూడా శాస్త్రీయంగా నిరూపితం కాలేదని చెబుతున్నారు. అయితే చాలా మంది మాస్క్‌కు బదులు షీల్డ్‌ను ఉపయోగించటానికే మొగ్గు చూపుతున్నట్లు చెప్పుకొచ్చారు.
కంటికి రక్షణగా ఉండటం సహా ముఖాన్ని ముట్టుకోకుండా ఇది అడ్డుగా నిలుస్తుందనే కారణం వల్ల ఈ ఫేస్‌షీల్డ్‌లను ఉపయోగిస్తున్నారని జాన్స్ హాప్కిన్స్ ఆస్పత్రిలోని బయోకంటైన్మెంట్ యూనిట్ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ క్రిస్టోఫర్ సుల్మోంటే చెప్పారు.