తెలంగాణ

telangana

ETV Bharat / international

రాజదంపతులకు 'బర్గర్ కింగ్'​ పార్ట్ టైమ్ ఉద్యోగాలు!

బ్రిటన్​ రాజ దంపతుల హోదా వదులుకోవాలని నిర్ణయించి సర్వత్రా చర్చనీయాంశమయ్యారు ప్రిన్స్ హ్యారీ, మేఘన్. వారిద్దరి గురించి నెట్టింట అనేక సరదా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. నేనేం తక్కువ కానంటూ ఈ ట్రెండ్​లో జాయిన్​ అయింది దిగ్గజ ఆహార సంస్థ బర్గర్​ కింగ్​. రాజ దంపతులకు ఉద్యోగాలు ఇస్తామన్న సరదా ట్వీట్​తో నెటిజన్లను ఫిదా చేసింది.

Burger King offers job to Royal couple
రాజదంపతులకు 'బర్గర్ కింగ్'​ పార్ట్ టైమ్ జాబులు!

By

Published : Jan 16, 2020, 12:51 PM IST

బ్రిటన్​ రాజదంపతులు ప్రిన్స్ హ్యారీ, మేఘన్​కు పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా కేంద్రంగా పనిచేసే బహుళజాతి ఆహార సంస్థ బర్గర్ కింగ్ ప్రకటించింది. అర్జెంటీనాలోని బర్గర్​ కింగ్ విభాగం ఈ మేరకు ఓ సరదా ట్వీట్ చేసింది.

రాజదంపతులకు 'బర్గర్ కింగ్'​ పార్ట్ టైమ్ ఉద్యోగాలు!

"ప్రియమైన డ్యూక్ హ్యారీ... మీరు కిరీటాన్ని వదలకుండానే మీ మొదటి ఉద్యోగాన్ని పొందవచ్చు. బర్గర్​ కింగ్​ మీకు పార్ట్​టైమ్ ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది."
- బర్గర్​ కింగ్ ట్వీట్​

ఫిదా అవుతున్న నెటిజన్లు

బర్గర్​ కింగ్ ట్వీట్​కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అదిరే సెటైర్​తో ఈ రోజు ఇంటర్నెట్​నే గెలుచుకున్నావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై తమదైన శైలిలో ట్వీట్లు కూడా చేస్తున్నారు.

"ప్రిన్స్ హ్యారీ తలుచుకుంటే మొత్తం మీ (బర్గర్ కింగ్​​) సంస్థనే కొనుగోలు చేయగలరు. కాకపోతే మెక్​ డొనాల్డ్స్ ఫ్రైస్​.. బర్గర్​ కింగ్ వంటకాల కంటే చాలా బాగుంటాయి."

"ప్రిన్స్ హ్యారీ ఇకపై ఫ్రైస్ చేయడం మొదలెడతారేమో!"

"ప్రిన్స్ హ్యారీ మెక్​డొనాల్డ్స్​లో పనిచేయనున్నాడు. ఇప్పటికే ఆయన దగ్గర ఓ విగ్ కూడా ఉంది."

జీవితాంతం ఫ్రీ కాఫీ

రాజదంపతులు కెనడాకు వస్తే, వారికి జీవితాంతం ఉచితంగా కాఫీ అందిస్తామని... కెనడియన్ కాఫీ సంస్థ 'టిమ్ హోర్టన్స్'​ ఇటీవలే ప్రకటించి, చర్చనీయాంశమైంది.

ఆర్థిక స్వతంత్రం కోసం

ప్రిన్స్ హ్యారీ, అయన భార్య మేఘన్.. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే 'సీనియర్ రాయల్స్' అర్హతలను వదులుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఉద్యోగాలు కల్పిస్తామని పలు సంస్థలు ముందుకొస్తున్నాయి.

ఇదీ చూడండి: అమెరికాలో సిక్కులకు ప్రత్యేక గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details