తెలంగాణ

telangana

ETV Bharat / international

రోడ్లు ఊడ్చి మనసు దోచేశాడు- ఉద్యోగం కొట్టేశాడు!

10 గంటల పాటు రోడ్లు శుభ్రం చేసిన ఓ యువకుడికి సువర్ణావకాశం వరించింది. ఇప్పటికే కారు, స్కాలర్​షిప్​లు అంటూ బహుమతులు అందుకున్న ఆ అమెరికన్​ కుర్రాడికి.. మున్సిపల్​ మేయర్​ పిలిచి మరీ ఉద్యోగ అవకాశమిచ్చారు.

Buffalo teen who cleaned up after protests gets job offer
రోడ్లు ఊడ్చి మనసు దోచేశాడు-ఉద్యోగావకాశం కొట్టేశాడు!

By

Published : Jun 14, 2020, 3:37 PM IST

న్యూయార్క్​ బఫెలో నగరానికి చెందిన ఆంటోనియో గ్విన్​కు మరో బంపర్​ ఆఫర్​ వచ్చింది. ఆ స్థానిక నగరపాలక మేయర్ బైరాన్​ బ్రౌన్​.. పట్టణ భవన శాఖలో ఉద్యోగ అవకాశమిచ్చి గ్విన్​ను ప్రశంసించారు.

గ్విన్​కు ఎందుకిన్ని ఆఫర్స్....?

​మినియాపోలిస్ నగర పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మరణించిన తరువాత అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనలు ముగిశాక ఆందోళనకారులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. బఫెలో నగరం బెయిలీ అవెన్యూకు చెందిన 18 ఏళ్ల గ్విన్​ మాత్రం ఆ నిరసనల కారణంగా రోడ్లపై మిగిలిన చెత్త, పగిలిన అద్దాల ముక్కలను గమనించాడు.

తన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న బాధ్యతతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో చీపురు చేతబట్టి శుభ్రం చేయడం ప్రారంభించాడు గ్విన్​. దాదాపు 10 గంటలు శ్రమించి.. నల్ల సంచుల్లో చెత్తను నింపేసి.. బెయిలీ అవెన్యూని మళ్లీ అందంగా మార్చేశాడు. ఇది చూసిన కొందరు..​ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

గ్విన్​ వీడియో చూసిన అధికారులు, నెటిజన్లు గ్విన్​ను ప్రశంసల్లో ముంచేశారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడక, స్వయంగా తన చేతులతో పనిని బాధత్యగా నిర్వర్తించాడు. దీంతో గ్విన్​కు ఆఫర్లు వరుస కట్టాయి. గ్విన్​ పనికి మెచ్చి ఒకరు 2004 ఫోర్డ్​ మస్టాంగ్​ కారును బహుకరిస్తే... మెడైల్లె కాలేజీ వారు గ్విన్​ ఉన్నత చదువులకు సీటిచ్చి, పూర్తి స్కాలర్​షిప్​ ప్రకటించారు. ఇప్పుడు మేయర్​ ఉద్యోగ అవకాశమిచ్చారు.

ఇదీ చదవండి:ట్రెండింగ్​: పరీక్షలు రద్దు చేయండి ప్లీజ్​!

ABOUT THE AUTHOR

...view details