తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2021, 8:52 AM IST

ETV Bharat / international

వందేళ్లకు తిరిగొచ్చిన రూ.556 కోట్ల ఆస్తి

1912లో ఓ బీచ్​ సమీపాన నల్లజాతీయుల కోసం నిర్మించిన ఓ రిసార్ట్.. తెల్లజాతీయులకు కంటగింపుగా మారింది. 1924లో ఈ రిసార్ట్‌ తెల్లవారి చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు అది మళ్లీ దాన్ని నిర్మించిన కుటుంబం వారికే దక్కనుంది. ఈ రిసార్ట్​ ప్రస్తుత విలువ దాదాపు రూ.556 కోట్లు.

bruces beach
బ్రూస్​ బీచ్​

ఇక మనది కాదనుకుని, తరాల కిందటే మర్చిపోయిన కోట్ల రూపాయల ఆస్తి, అనుకోకుండా చేతికొస్తే? అదే జరిగింది... దక్షిణ కాలిఫోర్నియాలో! విల్లా, ఛార్లెస్‌ బ్రూస్‌లు 1912లో ఇక్కడి బీచ్‌ సమీపాన నల్లజాతీయుల కోసం వెస్ట్‌కోస్ట్‌ రిసార్ట్‌ నిర్మించారు. ఇందులో లాడ్జి, కేఫ్‌, డాన్స్‌ హాల్‌ వంటివి ఉండేవి. తెల్ల జాతీయులకు ఇది కంటగింపుగా మారింది. ఓసారి దీనికి నిప్పు పెట్టేందుకు కూడా విఫలయత్నం చేశారు.

బ్రూస్​ బీచ్​

ఎలాగైనా ఈ రిసార్ట్‌ను ఆక్రమించుకోవడం కోసం అక్కడ ఓ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు మన్‌హటన్‌ బీచ్‌ అధికారులు ప్రకటించారు. ఇలా 1924లో ఈ రిసార్ట్‌ తెల్లవారి చేతుల్లోకి వెళ్లింది. అయితే... తిరిగి దీన్ని బ్రూస్‌ కుటుంబానికి అప్పగించనున్నట్టు కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ ప్రకటించారు. బ్రూస్‌ మునిమనవడు ఆంటోనీ బ్రూస్‌ సమక్షంలో గురువారం సంబంధిత బిల్లుపై సంతకం కూడా చేశారు. అప్పట్లో 1,225 డాలర్లకు కొన్న ఈ భూమి విలువ ప్రస్తుతం 75 మిలియన్‌ డాలర్లు. అంటే సుమారు రూ.556 కోట్లు!

ఇదీ చూడండి:127 ఏళ్లు జీవించిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డుల్లోకి!

ABOUT THE AUTHOR

...view details