ప్రముఖ పాప్ గాయని, నటి బ్రిట్నీ స్పియర్స్(britney spears news) న్యాయ పోరాటం ఫలించింది! ఆమె సంరక్షణ బాధ్యతల నుంచి తండ్రి జేమ్స్ స్పియర్స్‌ను(britney spears father) ఇక్కడి సుపీరియర్ కోర్టు తప్పించింది! ఇక నుంచి ఆ బాధ్యతలను న్యాయస్థానం నియమించిన జోడీ మోంట్‌గోమెరీ నిర్వర్తించనున్నారు. బ్రిట్నీ 2008లో మానసిక సమస్యలకు గురికావడంతో... ఆమె సంరక్షణ బాధ్యతలను తండ్రి చేపట్టారు. సుమారు 13 ఏళ్లుగా కుమార్తె జీవిత నిర్ణయాలను.. డబ్బులు, ఆస్తుల నిర్వహణను పర్యవేక్షిస్తూ వచ్చారు. అయితే, తన స్వేచ్ఛకు తండ్రి జేమ్స్ ఆటంకంగా మారారని, సంరక్షణ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించాలని కొంతకాలంగా బ్రిట్నీ(britney spears latest news) న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. ఆమె తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ, గురువారం తీర్పు వెలువరించింది. తాను ఏనాడూ కుమార్తె ప్రయోజనాలకు విరుద్ధంగా గానీ, ఆమెకు హానిచేసేలా గానీ నిర్ణయాలు తీసుకోలేదని జేమ్స్ పేర్కొన్నారు.
Britney Spears News: తండ్రి నుంచి బ్రిట్నీ స్పియర్స్‌కు స్వేచ్ఛ - బ్రిట్నీ స్పియర్స్
పాప్‌గాయని బ్రిట్నీ స్పియర్స్ (britney spears news) చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం దక్కింది. ఆమె తండ్రిని((britney spears father)) సంరక్షుని బాధ్యతల నుంచి తప్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సుమారు 13 ఏళ్లుగా కుమార్తె జీవిత నిర్ణయాలను.. డబ్బులు, ఆస్తుల నిర్వహణను ఆయనే పర్యవేక్షిస్తూ వచ్చారు.
తండ్రి నుంచి బ్రిట్నీ స్పియర్‌కు స్వేచ్ఛ
బ్రిట్నీ తన చిరకాల మిత్రుడు(britney spears boyfriend) శామ్ అస్గారీతో గత నెల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తీర్పు వెలువడటానికి కొన్ని గంటల ముందు బ్రిట్నీ అభిమానులు వందల సంఖ్యలో కోర్టు పరిసరాలకు చేరుకుని, ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:ట్రంప్‌కు వెన్నుపోటు పొడిచిన ఆర్మీ జనరల్!