కరోనా సోకిన వారు సాధారణంగా కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉంటారు. కాస్త పరిస్థితి విషమంగా ఉంటే.. నెలపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారు. కానీ.. 2020మార్చిలో ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి ఏకంగా 243 రోజులు ఆసుపత్రిలోనే గడిపారు. అయినప్పటికీ.. మరణం ఆయన్ని వెంటాడింది.
కొవిడ్ వల్లేనా..!
నికోలస్ సిన్నొట్.. బ్రిటీష్ ఎయిర్వేస్లో పైలట్‌గా పనిచేసేవారు. 2020లో లండన్, హౌస్టింగ్ నుంచి ప్రయాణిస్తుండగా ఆయన కొవిడ్ బారినపడ్డారు. అప్పటినుంచి దాదాపు 8 నెలలు ఆసుపత్రిలో గడిపిన ఆయన అకస్మాత్తుగా మరణించారు. ఇందుకు గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ.. కొవిడ్ అనంతర కారణాల వల్లే ఆయన మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. కరోనా వల్ల ఆయన శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముందే పేర్కొన్నారు.