తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈ రాష్ట్రాలు ఎటువైపు 'స్వింగ్' అవుతాయి? - అమెరికా ట్రంప్ బైడెన్

అగ్రరాజ్య ఎన్నికల పోరు రణరంగాన్ని తలపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్​లు హోరాహోరీగా తలపడుతున్నారు. వీరి విజయావకాశాలు 'స్వింగ్ స్టేట్స్​'పైనే ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాష్ట్రాలేంటి? ఇప్పటివరకు అక్కడ గెలిచిందెవరు? ఈసారి గెలిచి పట్టుబిగించేదెవరు?

Brief Survey of the 2020 US key states
ఈ రాష్ట్రాలు 'స్వింగ్' అయ్యేదెటు?

By

Published : Oct 31, 2020, 6:26 PM IST

అమెరికా ఎన్నికల ఘట్టం రసవత్తరంగా సాగుతోంది. తమకు పట్టున్న రాష్ట్రాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీసారి ఫలితాలు మారిపోతున్న 'స్వింగ్ స్టేట్స్​'... అభ్యర్థి జయాపజయాలను నిర్ణయించనున్నాయి. ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వివరణాత్మక కథనం.

అరిజోనా

అరిజోనా

పోరు హోరాహోరీగా సాగే రాష్ట్రాల్లో అరిజోనా ఒకటి. నిజానికి ఈ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీకి గట్టి పట్టుంది. కానీ ప్రస్తుతం పరిణామాలను నిశితంగా గమనిస్తే ఇక్కడి ప్రజల దృక్పథం మారినట్లు కనిపిస్తోంది.

ఫ్లోరిడా

ఫ్లోరిడా

ఫ్లోరిడాలో పోరు రసవత్తరంగా కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ అధ్యక్షుడు ట్రంప్​పై డెమొక్రాటిక్ నేత బైడెన్ కాస్త ఆధిక్యం కనబరుస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 2016లో స్వల్ప తేడాతో ఈ రాష్ట్రాన్ని రిపబ్లికన్లు చేజిక్కించుకున్నారు. ఈ సారి అదృష్టం బైడెన్ తలుపుతట్టనుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

జార్జియా

జార్జియా

1992 నుంచి జార్జియా రిపబ్లికన్ల చేతిలోనే ఉంది. కానీ ఈ సారి పరిస్థితి మారొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పోరు జోరుగా సాగే రాష్ట్రాల్లో జార్జియాను సైతం చేర్చుతున్నారు. కరోనా వైరస్ కేసుల ఉద్ధృతి, పోలీసు సంస్కరణలు, ఓటు హక్కు తదితర విషయాల్లో ఈ రాష్ట్రం ఇటీవల చాలా సార్లు వార్తల్లోకెక్కింది.

అయోవా

అయోవా

2016కు ముందు అయోవా రాష్ట్రం డెమొక్రాట్లకు కంచుకోట. కానీ గత ఎన్నికల్లో ట్రంప్ ఈ రాష్ట్రంలో అఖండ విజయం సాధించారు. 2012 ఎన్నికల్లో బరాక్ ఒబామా సాధించినదానితో పోలిస్తే 15 పాయింట్లు అధికంగా ఓట్లు కైవసం చేసుకున్నారు. 1980 తర్వాత ఈ ఎన్నికల్లోనే డెమొక్రాట్లు చిత్తుగా ఓడిపోయారు. అయితే ఈ సారి వీరు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలు కాకసస్​పైనే ఆధారపడి ఉంటాయన్నది విశ్లేషకులు చెప్పే మాట.

మిషిగన్

మిషిగన్

మహా ఆర్థిక మాంద్యం వరకు మిషిగన్ రాష్ట్రం రిపబ్లికన్లనే ఎన్నుకుంది. 2016లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో 0.2 శాతం ఓట్ల తేడాతో హిల్లరీ క్లింటన్​పై ట్రంప్ విజయం సాధించారు. ఈ సారి ఫలితాలు కూడా ఇదే విధంగా ఉండొచ్చు.

మిన్నెసోటా

మిన్నెసోటా

1972 తర్వాత రిపబ్లికన్లవైపు కన్నెత్తి కూడా చూడని ఈ రాష్ట్రాన్ని 2016 ఎన్నికల్లో ట్రంప్ తన హస్తగతం చేసుకున్నారు. 45 వేల ఓట్లు దక్కించుకున్నారు. ఈ సారి మిన్నెసోటాను చేజిక్కించుకోవడానికి ఇరువురు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

నెవాడ

నెవాడ

నెవాడలో ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ ఆధిక్యం కనబరుస్తున్నారు. 2016 ఎన్నికల్లోనూ ఇక్కడ హిల్లరీ హవానే నడిచింది. ఈ రాష్ట్రంలో గెలుపొందాలని చూస్తున్న ట్రంప్​.. భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది సభలకు హాజరయ్యారు. అయితే ఇక్కడికి వచ్చిన అభిమానులు, మద్దతుదారులు మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరాన్ని పాటించకుండా ఉండటం వల్ల ఈ ప్రచార సభల నిర్వహణపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది.

న్యూ హాంప్​షైర్

న్యూ హాంప్​షైర్

స్వింగ్ రాష్ట్రాల్లో కీలకమైనది న్యూ హాంప్​షైర్. ఇక్కడ విజయం సాధించడం గొప్ప విషయంలా భావిస్తారు. ఇక్కడి ప్రజలు సైతం అభ్యర్థుల పూర్వపరాలను నిశితంగా పరిశీలించి ఓటేస్తారు. పెద్దగా పేరులేని అభ్యర్థులకు కూడా ఇక్కడ గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఉత్తర కరోలినా

ఉత్తర కరోలినా

ఉత్తర కరోలినాలో తీవ్రమైన పోరు ఉంటుందని రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు. 2016లో 3.7 శాతం స్వల్ప ఓట్ల తేడాతో ఈ రాష్ట్రంలో గెలిచారు ట్రంప్. ఈ సారి కూడా పోటీ ఇదే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఓటింగ్​లో తేడా వస్తుందని డెమొక్రాట్లు కలవరపాటుకు గురవుతున్నారు.

ఓహయో

ఓహయో

ఎలక్ట్రోరల్ ఓట్ల సంఖ్య పరంగా చూస్తే ఇది అత్యంత కీలక రాష్ట్రం. ఓహయోలో 18 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్నాయి. 2016లో హిల్లరీపై 8 పాయింట్ల తేడాతో రాష్ట్రంలో గెలుపొందారు డొనాల్డ్ ట్రంప్.

పెన్సిల్వేనియా

పెన్సిల్వేనియా

గత ఎన్నికలతో పోలిస్తే పెన్సిల్వేనియాలో డెమొక్రాట్లు మెరుగ్గా రాణిస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక్కడి ఆఫ్రికా-అమెరికన్లు బైడెన్​కే మద్దతు పలుకుతున్నారు.

విస్కాన్సిన్

విస్కాన్సిన్

విస్కాన్సిన్​లోని ప్రజలు రిపబ్లికన్లకు మద్దతివ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడి అతిపెద్ద కౌంటీ అయిన మారథాన్ కౌంటీలో బరాక్ ఒబామాకు భిన్నఫలితాలు ఎదురయ్యాయి. 2008లో ఇక్కడ విజయం సాధించిన ఆయన... 2012 వచ్చే సరికి ఓటమి మూటగట్టుకున్నారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ ఇక్కడ భారీ ఆధిక్యంతో విజయఢంకా మోగించారు.

ABOUT THE AUTHOR

...view details