బ్రెజిల్లో చెలరేగుతున్న మంటల ధాటికి వందల సంఖ్యలో అటవీ జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. గత 47 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా ప్రమాదకర స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిలో సుమారు 200 చిరుతపులులు, సరీసృపాలు, ఇతర వన్య ప్రాణులు సజీవ దహనమయ్యాయని పాంథెరా అనే అంతర్జాతీయ అటవీ పరిరక్షణ సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఉష్ణమండల చిత్తడినేలలు కలిగిన బ్రెజిల్‌లోని పాంటనాల్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
అగ్నిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న జంతువులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఇందుకోసం అక్కడే ఓ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటికి చికిత్స అందిస్తున్నారు.