తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెజిల్​లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు - economy of brazil in corona

బ్రెజిల్‌లో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. రికార్డు స్థాయిలో కొత్త మరణాలు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 4,195 మంది.. వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3.37లక్షలకు చేరింది.

Brazil corona
బ్రెజిల్​లో కరోనా పంజా- రికార్డు స్థాయిలో మరణాలు

By

Published : Apr 7, 2021, 9:08 AM IST

బ్రెజిల్‌ను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొవిడ్ కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్​లో.. తాజాగా రికార్డుస్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో అత్యధికంగా 4,195 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అమెరికా, పెరూల్లో మాత్రమే ఇప్పటివరకు ఒక్కరోజులో 4 వేల మరణాలు సంభవించాయి. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 1.3 కోట్ల మంది కోవిడ్ బారినపడగా.. మహమ్మారి కారణంగా 3.37 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షలను సడలించడమే వైరస్ ఉద్ధృతికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో ఉన్న 90శాతం ఐసీయూల్లో కొవిడ్ రోగులే చికిత్స పొందుతున్నారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటివరకు.. బ్రెజిల్‌లో 3శాతం మంది ప్రజలు కొవిడ్ టీకాలు తీసుకున్నట్లు ఓ ఆన్​లైన్​ వెబ్​సైట్ తెలిపింది.

ఇదీ చూడండి:మోడెర్నా టీకాతో 6 నెలల పాటు రక్ష!

ABOUT THE AUTHOR

...view details