బ్రెజిల్‌లో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. నెల రోజుల వ్యవధిలో బ్రెజిల్‌లో దాదాపు లక్ష మంది కొవిడి కాటుకు బలికాగా.. ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో.. అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశం బ్రెజిలే కావడం గమనార్హం. మున్ముందు పరిస్థితి.. మరింత క్లిష్టంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏప్రిల్‌లో బ్రెజిలియన్లను మహమ్మారి ఎన్నడూ లేనంతగా బలి తీసుకుందని.. గడచిన వారం రోజులుగా సరాసరిన రోజువారీ మరణాలు 3 వేల ఒక్క వందగా నమోదయ్యాయి. ఆస్పత్రులు కూడా కరోనా రోగులతో నిండి పోయాయి. గురువారం బ్రెజిల్‌లో 3 వేల ఒక్క మంది చనిపోగా.. మొత్తం మరణాలు 4,01,186 చేరినట్లు బ్రెజిల్ ఆరోగ్యశాఖ తెలిపింది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 15 కోట్ల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు.
మొత్తం కేసులు: 151,117,679