తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా డేటా డిలీట్​ చేసిన ప్రభుత్వం​- ఎందుకు?

కరోనా కేసుల వివరాలను ప్రభుత్వ అధికారిక వెబ్​సైట్​ నుంచి తొలగించింది బ్రెజిల్​ ప్రభుత్వం. కరోనా మరణాలు నియంత్రించడంలో విఫలమయ్యారని అధ్యక్షుడు జైర్​ బొల్సొనారోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

corona
కరోనా

By

Published : Jun 7, 2020, 4:00 PM IST

బ్రెజిల్​లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 6,76,494 మందికిపైగా వైరస్ సోకింది. మృతుల సంఖ్య 36 వేలు దాటింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో నిలిచింది బ్రెజిల్.

ఈ నేపథ్యంలో కరోనా కేసుల వివరాలను అధికారిక వెబ్​సైట్​ నుంచి తొలిగించింది ఆ దేశ ప్రభుత్వం. వైరస్ వ్యాప్తి నియంత్రణలో విఫలమయ్యారని అధ్యక్షుడు జైర్ బొల్సొనారోపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త లెక్కలు

కరోనా వివరాలను డాకుమెంట్స్​ రూపంలో భద్రపరుస్తున్నామని తెలిపింది ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మొత్తం కేసుల వివరాలు చెప్పకుండా... గత 24 గంటల్లో 27,075 కొత్త కేసులు, 904 మరణాలు సంభవించాయని వెల్లడించింది. 10,029 మంది మరణించారని తెలిపింది.

ఇదే విషయంపై జైర్​ బొల్సొనారో మాట్లాడుతూ.. కేవలం కరోనా వివరాలు బ్రెజిల్​ పరిస్థితిని ప్రతిబింబించలేవని అన్నారు. కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అయితే వెబ్​సైట్​ నుంచి డేటాను ఎందుకు తొలగించారన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు బొల్సొనారో.

కరోనా డేటాను డిలీట్ చేయడాన్ని తప్పుబట్టారు ఆ దేశ జర్నలిస్టులు, కాంగ్రెస్​ సభ్యులు.

ఇదీ చూడండి : లైవ్​ వీడియో: సర్ఫర్​పై షార్క్​ దాడి

ABOUT THE AUTHOR

...view details